హైదరాబాద్, జూలై 28(నమ స్తే తెలంగాణ) : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనా మా విద్యార్థుల పోరాటపటిమ, ఐక్యతకు లభించిన గొప్ప విజయమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. విద్యార్థులు తలుచుకుంటే ఎంతటి శక్తినైనా ఎదిరించవచ్చని, ఏ ప్రభుత్వమైనా వారి డిమాండ్లకు తలొగ్గాల్సిందేనని ఈ ఘటన స్పష్టం చేసిందని మంగళవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే హకు ఏ ప్రభుత్వానికీ లే దని స్పష్టంచేశారు. ఆందోళనలు, నిరసనలతో తమ హకుల కోసం వీరోచితంగా పోరాడిన విద్యార్థి లోకానికి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కేవలం రాజీనామాతో సరిపెట్టకుండా, విద్యార్థుల సమస్యలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిషరించాలని కొప్పుల డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జులై 28 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య ఉండదని, ఏ సంవత్సరం బకాయిలు ఆ సంవత్సరంలోనే చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొనడం చూస్తుంటే ఇది సాధ్యమేనా అనే అనుమానం కలుగుతున్నదని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విడుదల చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ మాత్రం ప్రతి సమస్యకూ గత ప్రభుత్వాన్నే బూచిగా చూపిస్తున్నదని, ఇలా చేయడం చేతకానితనానికి నిదర్శనమని తుంగ బాలు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.