యాక్షన్ థ్రిల్లర్ మకుటం
స్వీయ దర్శకత్వంలో విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మకుటం’. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 99వ చిత్రమిది. అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
స్వీయ దర్శకత్వంలో విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మకుటం’. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 99వ చిత్రమిది. అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. మంగళవారం ‘కలతేలా..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. జీవీ ప్రకాష్ స్వరపరచిన ఈ గీతాన్ని రాజశ్రీ సుధాకర్ రచించారు.
కృష్ణతేజస్వి ఆలపించారు. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ఎమోషనల్‌గా ఈ పాట సాగింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో విశాల్ త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, విశాల్ కెరీర్లో ఇదొక విభిన్న కథాంశమని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, కథ: రవి అరసు, నిర్మాత: ఆర్.బి.చౌదరి, దర్శకత్వం: విశాల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

