లంచగొండులకు ఉద్వాసనే సరైన శిక్ష
వివిధ రకాల ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రజలు తమ వ్యక్తిగత పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుంటారు. అలాంటి వారి పనులు పూర్తి చేయడానికి ఆయా పనులను బట్టి వెల నిర్ణయించి ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం అన్నిరంగాల్లో ఊడల్లా పేరుకుపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ రంగాలు, రాజకీయరంగంలో ఈ ధోరణి కుప్పలు తెప్పలుగా ఉంటున్నది. అవినీతి అనేది ఒక రకమైన నీతి, నిజాయితీ లేని చర్య లేదా క్రిమినల్ నేరం. ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు భాగం. పాలన సక్రమంగా కొనసాగాలంటే ఉద్యోగుల పాత్ర ఎంతగానో దోహదపడుతుంది. ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివిధ శాఖల ద్వారా ప్రజలకు సక్రమంగా అందాలంటే, ఉద్యోగులు నీతి, నిజాయితీగా తమ విధులను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది.
వివిధ రకాల ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రజలు తమ వ్యక్తిగత పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుంటారు. అలాంటి వారి పనులు పూర్తి చేయడానికి ఆయా పనులను బట్టి వెల నిర్ణయించి ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రజలకు నిర్ణీత కాలవ్యవధిలో ఉచితంగా సేవలు అందించాల్సిన అధికారులు, ఉద్యోగులు పీడిస్తూ లంచం రూపేణా వివిధ మార్గాల ద్వారా డబ్బులు తీసుకుంటూ పనులు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదే తంతు కొనసాగుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఆయా కార్యాలయాల్లో జిల్లా స్థాయి అధికారులకు, మధ్యతరగతి, చిన్నతరహా ఉద్యోగులకు రాజకీయ నాయకులు, ఆయా ఉద్యోగ సంఘాల నేతల అండదండలు పుష్కలంగా ఉంటున్నాయి. దీనివల్ల వారు నిత్యం అవినీతి, అక్రమాలు, లంచగొండితనానికి పాల్పడుతూ ఉద్యోగంలో చేరిన ఐదు నుంచి పదేండ్లలోనే కోట్లాది రూపాయల స్థిర, చరాస్తులు సంపాదిస్తున్నారు.
తహసీల్దార్ స్థాయి నుంచి సబ్ రిజిస్ట్రార్ స్థాయి అధికారులు, మిగతా ఉద్యోగులు కూడా (గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3) అక్రమ మార్గాల్లో రెండు చేతులా సంపాదిస్తూ పట్టణాల్లో పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకుంటూ, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, భూములు, బంగారం, వెండి ఆభరణాలు, లగ్జరీ కార్లు సంపాదిస్తున్నారు.అక్రమంగా సంపాదించే ఆస్తులు ఎక్కువైతే తమ బంధువుల పేర్ల మీద (బినామీల) రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు.
అక్రమ ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉన్న రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, ఇంజినీరింగ్, ఆర్ అండ్ బీ, నీటి పారుదల, బిల్డింగ్ అండ్ పర్మిషన్, విద్య, వైద్యం తదితర శాఖల్లో ఉన్నతాధికారులు మొదలుకొని మధ్ తరగతి, చిన్న ఉద్యోగులు సైతం ఇదే తీరున వ్యవహరిస్తున్నారు.
ఎంతోమంది రాజకీయ నేతలు తమ పదవీకాలంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని అవినీతి, అక్రమాలకు పాల్పడేందుకు పరోక్షంగా దోహదపడుతున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేతలు, అధికారులు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని లక్షలు, కోట్లాది రూపాయలు లంచం రూపంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంపాదిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, నిజాయితీ గల చిన్న, మధ్య తరగతి ఉద్యోగులు మూడు దశాబ్దాల నుంచి నాలుగు దశాబ్దాల వరకు ప్రభుత్వ సేవలు చేసి, కేవలం వేతనం మీద ఆధారపడి పిల్లలను చదివించుకుంటూ, కుటుంబాన్ని పోషించేందుకు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుతున్నారు. స్థిరనివాసం కోసం కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేని దుర్భర స్థితిలో ఎంతోమంది నిజాయితీ గల ఉద్యోగులు ఉన్నారు. నేటికీ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సొంత ఇల్లు లేని చిన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి, లంచగొండితనాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖను (ఏసీబీ) ఏర్పాటు చేసింది. ఈ శాఖ అధికారులు తమకు అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ ఏదో ఒక జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, లంచగొండి అధికారుల ఇండ్లల్లో దాడులు నిర్వహిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. అయినప్పటికీ లంచావతారుల తీరు ఏమాత్రం మారడం లేదు. ఏసీబీ అధికారులకు పట్టుబడిన కోట్లాది రూపాయల ప్రజాధనం, ఆస్తులు, బంగారం వంటి వాటిని జప్తు చేసి ప్రభుత్వ ఖజానాలో నిల్వ చేయాలి. వాటిని ప్రజలకు అందించే వివిధ పథకాలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం నిజాయితీగా వెచ్చించాలి.
ఏసీబీ అధికారులకు పట్టుబడిన అవినీతి అధికారులను రక్షించడానికి టీజీవో నాయకులు, టీఎన్జీవో నాయకుల అండదండలు పుష్కలంగా ఉంటున్నాయి. వీరితోపాటు రాజకీయ నాయకుల అండదండలతో ఏసీబీకి పట్టుబడినవారు మళ్లీ ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇది చాలా దారుణం.
అలాంటి అధికారులు, ఉద్యోగులపై ఏసీబీ మరింత దృష్టి పెట్టాలి. అవినీతి తిమింగలాలను గుర్తించి, పట్టుకుని కోర్టుకు సరెండర్ చేసి, సస్పెండ్ చేయించి, ఉద్యోగాల నుంచి తొలగించాలి. ఏసీబీకి పట్టుబడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలులో నిర్బంధించాలి. అవినీతికి పాల్పడే అధికారులు, సిబ్బంది గురించి ఎవరు ఫిర్యాదు చేసినా వారి వివరాలు గోప్యంగా ఉంచడం ద్వారా ఫిర్యాదుదారులను చైతన్యవంతం చేసేందుకు నమ్మకం, భరోసా కలిగించాలి. రాష్ట్రంలోని యువత, ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఇప్పటికైనా మేల్కొని అవినీతి, లంచగొండితనం నిర్మూలనకు తమ వంతు కృషిచేయాలి.
(వ్యాసకర్త: విశ్రాంత ఉపాధ్యాయ సంఘం నేత)
కందుకూరి దేవదాసు
99499 37745
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

