Odela | విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ట్రాన్స్ కో అధికారులు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో అధికారులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు.
Odela | ఓదెల, జులై 9 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ట్రాన్స్ కో అధికారులు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో అధికారులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ సరిగా ఉందా లేదా అనే విషయాన్ని గమనించి అందుకు కావలసిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద కొంత మేర ప్రమాదాలు నివారించవచ్చని పేర్కొన్నారు.
కొన్ని సందర్భాలలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ సరిగా లేని కారణంగా మేత కోసం వచ్చి పశువుల మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. దీంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఏఈ మోహన్ నాయక్ తెలిపారు. అలాగే రైతులు కూడా ట్రాన్స్ఫార్మర్ వద్ద జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. రైతులు స్వతహాగా ఏ నిర్ణయం తీసుకోవద్దని కోరారు. కరంటు మోటార్లు, స్టార్టర్లు, సర్వీస్ వైర్ల వద్ద ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో సీనియర్ లైన్ ఇన్స్ పెక్టరు రాజయ్య, లైన్ మెన్ రాజయ్య, అసిస్టెంట్ లైన్ మెన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

