సిరిసిల్ల రూరల్, జూన్ 28 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్లీ బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు, విమర్శలతోపాటు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సిరిసిల్లలోని బీఆర్ఎస్ నేతలు ఘాటు గా స్పందిస్తున్నారు.
ఈ మేరకు శనివారం తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో బీఆర్ఎస్ సీనియ ర్నేత, సర్పంచుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు, ఆయన వెంట ఉన్న బీఆర్ఎస్వై నేత అఫ్రోజ్‌ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మాట్ల మధును జిల్లెల్ల నుంచి ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అఫ్రోజ్‌ను తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌కు తర లించారు. ఇటీవల కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం హైదరాబాద్ గాంధీభవన్‌లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత మాట్ల మధు, బీఆర్ఎస్ దళిత నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సైతం ప్రెస్ మీట్ పెట్టారు. ఇలా వరుస ప్రెస్ మీట్లు పెట్టడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. కాగా, కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, బద్నాం చేస్తున్నారని, కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన తమను అరెస్ట్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత మాట్ల మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇల్లంతకుంటకు తరలిన బీఆర్ఎస్ నేతలు
బీఆర్ఎస్ సీనియర్ నేత మాట్ల మధు అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఇల్లంతకుంటకు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. సిరిసిల్ల రూరల్ సీఐతో ఫోన్లో మాట్లాడడంతో అనుమతించారు. ఈ క్రమంలో పోలీసులతో స్వల్ప వాగ్వాదం జరిగింది. కాగా, గజ్జెల కాంతం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి వేములవాడకు వెళ్లిన తర్వాత మాట్ల మధును పోలీసులు వదిలిపెట్టారు. తరువాత అఫ్రోజ్ ను కూడా వదిలేయడంతో నేరుగా వారు సిరిసిల్ల క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లగా, అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య వారికి సంఘీభావం తెలిపారు.
ముందస్తు అరెస్టులతో ప్రశ్నించే గొంతులను ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. ఆయా చోట్ల మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, వలకొండ వేణుగోపాలరావు, కేటీఆర్సేన మండలాధ్యక్షుడు నందగిరి భాస్కర్‌గౌడ్, గుండు ప్రేమ్‌కుమార్, బొడ్డు శ్రీధర్, మోతె మహేశ్‌యాదవ్, కుర్మ రాజయ్య, రాగిపెల్లి కిష్టారెడ్డి, అమ ర్రావు, కట్ట రవి, క్యారం పరశురాములు, ఇల్లంతకుంట మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, మండల ఉపసర్పంచుల ఫోరంమాజీ అధ్యక్షుడు ఎండీ సాదుల్, మాజీ ఎంపీటీసీ అనిల్, రాగటి రమేశ్, రఘు, ఎర్ర రమేశ్, అల్వాల సాయిరాం, సిలివేరి స్టెప్పీ తదితరులు ఉన్నారు.