Power problems | , సెప్టెంబర్ 7: ఓ వైపు ప్రభుత్వం నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అది ఏ మాత్రమూ అమలు కావడం లేదు. గ్రామాల్లోని అతి ప్రాముఖ్యమైన వినాయక నిమజ్జన వేడుకలకు సైతం విద్యుత్ కోతల కష్టాలు తప్పలేదు. శనివారం రాత్రి మల్లాపూర్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా చేపట్టిన శోభాయాత్ర సమయంలో సుమారు రెండు గంటలకు పైగా కరెంట్ లేక చిమ్మ చీకట్లోనే వాహనాల లైట్ల సాయంతో వేడుకలను నిర్వహించారు.
దీంతో యువజన సంఘాల నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సర్కార్, విద్యుత్ శాఖ అధికారులపై సోషల్ మీడియా ద్వారా, శోభాయాత్రలో మండిపడ్డారు. కనీసం ఉత్సవాలను సైతం తిలకించడానికి వచ్చిన మహిళలు ఇబ్బందులు పడి వెనుదిరాగాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతమంది పలుమార్లు సంబదిత శాఖ అధికారులకు ఫోన్లు చేసినప్పటికి పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. ఈ విషయమై ఏఈ వినీత్ రెడ్డిని వివరణ కోరగా గ్రామంలో విద్యుత్ తీగలు అంటుకోగా మరమ్మత్తులు చేసి సరఫరా చేసేందుకు సమయం పట్టిందని, ఈ సమస్యతో విద్యుత్ సబ్ స్టేషన్లో కొంత సమస్య రావడంతో సిబ్బందితో కలిసి రాత్రి సమయంలో పనిచేసి విద్యుత్ ను యధావిదిగా అందిచినట్లు తెలిపారు.