Police | మెట్పల్లి ,మే 29: పట్టణంలో 63వ జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను పోలీసులు పూడ్చివేశారు. ఆర్టీసీ డిపో నుంచి ఆరపేట శివారు వరకు ప్రమాదాల నివారణ లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం తాత్కాలిక మరమ్మతులు చేశారు.
గుంతలను పూడ్చడం తో పాటు రహదారిపై పలుచోట్ల మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని వేచి చూడకుండా పోలీసులే తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం పట్ల స్థానికులు వర్షం వ్యక్తం చేస్తున్నారు.