Vemulawada | వేములవాడ, జూన్ 11: ఉద్యమ కళాకారుల హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ బుధవారం వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న సన్నిధిలో ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి కళాకారుల హామీలు సత్వరమే పరిష్కరణ చేసే విధంగా చూడాలని రాజన్నను వేడుకున్నట్లు తెలిపారు. అలాగే ఈనెల 14,15 తేదీలలో జరుగనున్న మహా చండీయాగం కరీంనగర్ తపాల లక్ష్మీనరసింహస్వామి ఆలయముకు 33 జిల్లాల కళాకారుల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి, ఉత్తర తెలంగాణ కళాకారుల విభాగం కోఆర్డినేటర్ బొడ్డు రాములు, ఉద్యమ కళాకారుల జిల్లా ప్రధాన కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ, డాన్స్ మాస్టర్ గంగ శ్రీకాంత్, కళాకారులు మిద్దె వినీత్, వెదిరే రవి,మామిండ్ల సత్తయ్య, ఎర్ర రవిరాజు,బండ రాయమల్లు తదితర కళాకారులు పాల్గొన్నారు.