నీరుకుల్ల సమ్మక్క-సారలమ్మ జాతర చైర్మన్‌గా పొన్నం చంద్రయ్య గౌడ్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల-వేగురుపల్లి గ్రామాల పరిధిలోని రంగనాయక స్వామి దేవాలయం ఆవరణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర చైర్మన్ గా నీరుకుల్ల గ్రామానికి చెందిన పొన్నం చంద్రయ్య గౌడ్ నియమితులయ్యారు.
సుల్తానాబాద్ రూరల్, జనవరి 20 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల-వేగురుపల్లి గ్రామాల పరిధిలోని రంగనాయక స్వామి దేవాలయం ఆవరణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర చైర్మన్ గా నీరుకుల్ల గ్రామానికి చెందిన పొన్నం చంద్రయ్య గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. జాతర కమిటీ సభ్యులుగా నేరెళ్ల రాజయ్య, అడ్డగుంట శ్రీనివాస్, కోమల, ప్రశాంత్, సిరిసిల్ల కళావతిని నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ గా నియమించినందుకు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు పొన్నం చంద్రయ్య గౌడ్, సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 28, 29, 30 మూడు రోజుల పాటు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ జాతరలో పాల్గొనే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని నూతన చైర్మన్ చంద్రయ్య గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

