Peddapally | కాల్వ శ్రీరాంపూర్, అక్టోబర్ 28 : పోలీసు అమరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ లో పోలీసులు మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
అమరవీరులను స్మరించుకుంటూ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీ బేగంపేట క్రాస్ రోడ్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులను కోల్పోవడం బాధాకరణమన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు గజ్జి క్రిష్ణ, రమేష్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సైలు వెంకటేష్, సనత్ రెడ్డి, మధుకర్, రమేష్ గౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.