Police | తిమ్మాపూర్, అక్టోబర్ 6 : ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి ఎల్ఎండీ పోలీసులు ఆ ఫోన్ను తిరిగి అందజేశారు పోలీసుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్ మండలంలోని జూగుండ్ల గ్రామానికి చెందిన జాల నరసయ్య ఏడాది కింద ఫోన్ పోగొట్టుకున్నాడు. కాగా దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐఈఆర్ పోర్టల్ లో నమోదు చేయగా దొరికిన ఫోన్ను పోలీసులు బాధితుడికి సోమవారం అప్పగించారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే ఫిర్యాదు చేయాలని ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ సూచించారు.