Register Case | చిగురుమామిడి, డిసెంబర్ 24: చిగురుమామిడి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి హోంగార్డుపై గ్రామానికి చెందిన యువకుడు దాడి చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి మండల కేంద్రంలో భార్యాభర్తల గొడవ విషయంపై 100కు ఫోన్ రావడంతో ఘటన స్థలానికి కానిస్టేబుల్ విజయేందర్ నాయక్ తో పాటు హోంగార్డు రఘురాం కలిసి వెళ్లారు.
ఆ క్రమంలో సతీష్ అనే వ్యక్తి తాగిన మైకంలో హోంగార్డుపై కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో హోంగార్డు రఘురాం తలకు తీవ్ర గాయమైంది. మరో కానిస్టేబుల్ పై దాడికి ప్రయత్నించగా ఆయనా తప్పించుకున్నాడు. అలాగే వారి వద్ద ఉన్న ట్యాబ్ ధ్వంసమైంది. దాడి చేసిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.