అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని పోలీసు ఉన్నతాధికారులు కొనియాడారు. వారి స్ఫూర్తితో సమాజంలో శాంతిస్థాపనకు పునరంకింతం కావాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా ఫ్లాగ్ డే
- పోలీస్ అమరులకు ఘననివాళి
- కరీంనగర్, రామగుండంలో సీపీలు సత్యనారాయణ, చంద్రశేఖర్..
- చందుర్తి మండలం లింగంపేటలో కలెక్టర్ అనురాగ్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, జగిత్యాలలో కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ హాజరు
- వ్యాసరచన, ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం
రాంనగర్(కరీంనగర్)/ ఫర్టిలైజర్‌సిటీ/జగిత్యాల కలెక్టరేట్/చందుర్తి, అక్టోబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని పోలీసు ఉన్నతాధికారులు కొనియాడారు. వారి స్ఫూర్తితో సమాజంలో శాంతిస్థాపనకు పునరంకింతం కావాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్, రామగుండం పోలీసు కమిషనరేట్లు, రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట శివారులో, జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అమరువీరుల సంస్మరణ దినం(ఫ్లాగ్ డే)ను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వ్యాసరచన, ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కరీంనగర్లో సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ అసాంఘికశక్తులతో జరిపిన పోరులు అసువులుబాసిన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు.
పోలీసు అమరుల స్ఫూర్తితో షీటీంల సహకారంతో విద్యార్థినులు, మహిళలపై అఘాయిత్యాలను అరికడుతున్నామన్నారు. రామగుండం కమిషనరేట్‌లో సీపీ చంద్రశేఖర్‌రెడ్డి అమరులకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ అధునాతన టెక్నాలజీలతో సైబర్ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా 2021 అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు ఒకటి వరకు దేశవ్యాప్తంగా ప్రాణాలర్పించిన 264 మంది పోలీసుల పేర్లను అడిషనల్ డీసీపీ (పరిపాలన) జీ చంద్రమోహన్ చదివి వినిపించారు. కాగా, సృ్మతి పరేడ్‌కు ఆర్ఐ కిరణ్ కుమార్ కమాండర్ గా వ్యవహరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే పోలీస్ అమరులకు నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ జీ. రవి, ఎస్పీ సింధూశర్మ, పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతిస్థాపనలో పోలీసుల కృషి ప్రశంసనీయమన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

