Bandi Sanjay | హైదరాబాద్ : బాలికపై లైంగిక దాడి, ఇతర నేరారోపణల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పీఎస్‌లో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ బండి సంజయ్ కొడుకు మీద చర్యలకు ఉపక్రమిస్తూ.. బండి సాయి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు.
ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్‌లోని బండి సంజయ్ నివాసంలో తనిఖీలు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు తాజాగా కరీంనగర్‌లోని బండి సంజయ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. పోలీసులు ఢిల్లీ, హైదరాబాద్, కరీంనగర్లో సాయి భగీరథ్ కోసం బృందాలుగా గాలింపు కొనసాగిస్తున్నారు. 5 బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.
బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ.. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్తోపాటు ప్రజాసంఘాలు, విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కాగా పోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్ నేటికీ పరారీలోనే ఉన్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
బ్రేకింగ్ న్యూస్
కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నివాసంలో పోలీసుల తనిఖీలు
POCSO కేసులో తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు బండి భగీరథ్ కోసం గాలింపు https://t.co/yAE9B3WHOr pic.twitter.com/MYr7qavo6s
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026
బండి భగీరథ్ కోసం వెతుకుతున్న పోలీసులు
హైదరాబాద్‌లోని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ నివాసంలో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు https://t.co/BklQkfoPBf pic.twitter.com/664E0DsxMI
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026