yellareddypeta | ఎల్లారెడ్డిపేట మార్చి 30 : పేదరికం ఎదుర్కొంటున్న తమకు అంధుడైన కుమారుడు ఉన్నాడని అతనికి సదరం సర్టిఫికెట్ కూడా ఉందని అయినప్పటికీ కూడా పెన్షన్ మంజూరు కానందున పింఛన్ ఇప్పించాలని బొప్పాపూర్ కు చెందిన పోచంపల్లి గంగాధర్ లావణ్య దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
కుటుంబీకుల వివరాల ప్రకారం.. బొప్పాపూర్ కు చెందిన పోచంపల్లి గంగాధర్ లావణ్య దంపతుల కుమారుడు యశ్వంత్ (6) పుట్టుకతోనే అందత్వంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం పలు హాస్పిటల్ లలో లక్షలు ఖర్చు చేసినా చూపు తిరిగి రాలేదని వాపోయారు.
దీంతో అందత్వ ధ్రువీకరణ కోసం 2022లో సదరన్ సర్టిఫికెట్ తీసుకున్నామని, సదరం సర్టిఫికెట్ తో పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టు తిరిగినా పింఛన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కుమారుడికి పింఛన్ ఇప్పించాలని వేడుకుంటున్నారు.