Chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 27: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో గులాబీ పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు.
బొమ్మనపల్లిలో గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల రమేష్, ఓగులాపూర్ లో అధ్యక్షులు ఎండ్ర నారాయణ, నవాబ్ పేట్ లో అధ్యక్షుడు పిల్లి వేణు, రేకొండలో బిల్ల వెంకట్ రెడ్డి, ముల్కనూరులో బుర్ర తిరుపతి, మధుమాణిక్యంలో బోయిని రమేష్, రామంచలో గిట్ల తిరుపతిరెడ్డి, ఇందుర్తిలో ఎస్కే సిరాజ్ తో పాటు పలు గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ జెండాలను ఎగురవేశారు. అనంతరం జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బి ఆర్ ఎస్ రాష్ట్ర సాధన క్రమంలో ఉద్యమ కాలంలో ఉన్న ఎన్నో సమస్యలను అధికార పార్టీగా ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతూ ప్రజల సమస్యలను గెలుచుకుందన్నారు.
అభివృద్ధి సంక్షేమం అనే పదాలతో కొత్త భాష్యం చెబుతూ దేశానికి బీఆర్ఎస్ మార్గదర్శకంగా నిర్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండ కట్టాలని ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వానికి బీఆర్ఎస్ పార్టీ దిక్సూచి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ గలమెత్తి ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ భేతి రాజిరెడ్డి, మండల నాయకులు పెనుకుల తిరుపతి, బెజ్జంకి రాంబాబు, ఎండి సర్వర్ పాషా, బెజ్జంకి లక్ష్మణ్, బోయిని శ్రీనివాస్, సర్పంచ్ భవాని, ఉప సర్పంచ్ విజయలక్ష్మి, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు కానుగంటి భూమిరెడ్డి, మిట్టపల్లి మల్లేశం, పెండ్యాల సదానందం, కాసర్ల హరీష్, తోట శ్రీనివాస్, బద్దం బాల్రెడ్డి, పిల్లి వేణు, మద్దెల రమేష్, అనుమాండ్ల సత్యనారాయణ, కూతురు శరభంద రెడ్డి, బోయిని సంపత్, సతీష్, ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.