వీణవంక, సెప్టెంబర్ 16 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర వాస్తవాలను వక్రీకరిస్తున్న బీజేపీని తరలిమికొట్టండని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో మంగళవారం సీపీఎం మండల కార్యదర్శి పిల్లి రవియాదవ్ ఆధ్వర్యంలో అమరుల స్తూపానికి నాయకులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి రాజకీయంగా వాడుకోవాలని చూస్తుందని, కమ్యూనిస్టు పార్టీ ఐదేళ్ళ పాలనలో 4 వేలమంది కార్యకర్తలు వీరమరణం పొందారని తెలిపారు. చరిత్ర తెలియకపోతే తెల్సుకొని మాట్లాడాలని బీజేపీకి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓదెలు, రమేష్, రాజు, రాజేందర్, కుమార్, రాజేశ్, శివ, రాజయ్య, సాగర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.