మూడోసారి పెట్రో వాత.. వాహనదారులకు మరోసారి షాక్
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే రెండుసార్లు పెంచి వాహనదారుల నడ్డి విరువగా, తాజాగా శనివారం కూడా పెట్రోల్‌పై 87 డీజిల్‌పై 91 పైసలు పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు ప్రకటించి, వెంటనే అమలులోకి తీసుకొచ్చాయి.
- పెట్రోల్‌పై 87, డీజిల్‌పై 91 పైసలు పెంపు
కరీంనగర్ కలెక్టరేట్, మే 23 : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే రెండుసార్లు పెంచి వాహనదారుల నడ్డి విరువగా, తాజాగా శనివారం కూడా పెట్రోల్‌పై 87 డీజిల్‌పై 91 పైసలు పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు ప్రకటించి, వెంటనే అమలులోకి తీసుకొచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 350 వరకు బంకులుండగా, వీటిలో నిత్యం సగటున 14 లక్షల లీటర్ల డీజిల్, 6 లక్షల లీటర్ల పెట్రోల్ విక్రయాలు జరుగుతుంటాయి.
ఈ లెక్కన ఇటీవల పెరిగిన ధరలతో వాహనదారులపై నెలకు రూ.11 కోట్ల దాకా అదనపు భారం పడుతుండగా, తాజాగా పెరిగిన ధరలతో మరో రూ.4.5 కోట్ల భారం పడనుంది. ఇష్టారాజ్యంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం మూలంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు అనేక ఇక్కట్లపాలవుతుండగా, తాజాగా పెరిగిన ఇంధన ధరలతో నిత్యావసరాల ధరలు కూడా మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

