Lok Adalath | పెద్దపల్లి కమాన్, జూన్ 14 : కక్షిదారులు రాజీ కుదుర్చుకున్న కేసులకు లోక్ ఆధాలాత్ లో శాశ్వత పరిష్కారం దొరుకుతుందని , ఈ కేసులను పై కోర్టులో అప్పీల్ చేసేందుకు ఆస్కారం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. పెద్దపల్లి సబ్ కోర్ట్ లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అధాలాత్ కు ముఖ్య అతిథిగా హాజరై న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. చిన్న చిన్న తగాదాలతో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు.
భార్య భర్తలు గొడవలు పడి విడాకుల కోసం కోర్టుకు వెళ్తే వారి పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కే స్వప్న రాణి, జూనియర్ సివిల్ జడ్జి మంజుల, డీసీపీ కరుణాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్, సీఐ ప్రవీణ్, ఎస్ఐలు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.