జగిత్యాల, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని, గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరవేసేందుకు కృషి చేద్దామని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జగిత్యాల నియోజకవర్గ నాయకులతో ఆదివారం సమావేశమయ్యారు. నియోజకవర్గ నాయకులకు దిశా నిర్దేశం చేయడంతో పాటు, జగిత్యాలతో తనకు ఉన్న అనుబంధం, జగిత్యాల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు, ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు తదితర అంశాలను ప్రస్తావించారు.
జగిత్యాలతో తనకు ఆత్మీయ బంధం ఉన్నదని కవిత చెప్పారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా తాను గెలవడం, జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ ఓడిపోవడం, పార్టీలకతీతంగా వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని తపించడం, తదితర అంశాలు కండ్లముందు ఉన్నాయన్నారు. జగిత్యాలలో అప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, అభివృద్ధిలో జగిత్యాల వెనుకబడొద్దన్న కేసీఆర్ ఆదేశాలను ఆమె గుర్తుకు తెచ్చుకున్నారు. కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమం ప్రజలకు ఎంతగానో మేలు చేసిందన్నారు. చిన్న జిల్లాల ద్వారానే ఎకువ అభివృద్ధి జరుగుతుందని, గ్రామాల్లో ఉన్న ప్రతి పేద వ్యక్తికి కూడా తెలంగాణ సాధించిన ఫలితం అందుతుందని కేసీఆర్ తెలంగాణ ఉద్యమం రోజుల్లోనే చెప్పేవారని, ఆ పద్ధతిలోనే జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. హైదరాబాద్ తర్వాత ఎకువ సంఖ్యలో 4,500 డబుల్ బెడ్ రూం ఇండ్లు జగిత్యాలకే కేటాయించి ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారన్నారు.
పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, 2014లో ఎమ్మెల్యే కాకపోయినా పార్టీ ప్రతి కార్యక్రమంలో వేదిక పైకి తీసుకొచ్చి, కాబోయే ఎమ్మెల్యే అంటూ ఐదేండ్లపాటు ప్రతి గ్రామంలో చెప్పిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. 2014లో ఎమ్మెల్యేగా ఉన్న జీవన్‌రెడ్డి ఎన్ని ఆకృత్యాలు, ఆఘాయిత్యాలు చేసినా, బీఆర్ఎస్ కార్యకర్తలంతా ముందుండి కొట్లాడడం వల్లే, జగిత్యాలలో గులాబీ జెండా ఎగిరిందన్నారు. నాయకులు పార్టీలు మారి నా, కార్యకర్తలు పార్టీలోనే ఉంటారని చెప్పడానికి మంచి ఉదాహరణ జగిత్యాల నియోజకవర్గమని స్పష్టం చేశారు.
ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి మా రిపోయినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తే అర్థముండేదని, కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా గోడ మీద పిల్లిలాగా ఉండడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం లాంటిదని ఎమ్మె ల్సీ కవిత ఫైర్ అయ్యారు. అలాంటి ఎమ్మెల్యేను ప్రజలు క్షమించరన్నారు. దేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎకడా లేదని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఏ ఒక పనిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంకా ప్రారంభించలేదని విమర్శించారు.
ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా సిద్ధం చేసుకోవాలని, కేసీఆర్ హయాం లో ఎలా ఉంది..? ప్రస్తుతం ఎలా ఉంది..? అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. కరెంటు కోతలు, రైతు భరోసా, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వకుండా ఎలా మోసం చేశారనే అంశాలను ఇప్పటి నుంచే చెప్పాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ శ్రే ణులకు సూచించారు. వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలను తీసుకొని, స్థానిక సంస్థల ఎన్నికల్లో జగిత్యాలలో మెజారిటీ సీట్లు గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేద్దామన్నారు.
కాగా ఈ సమావేశంలో పా ల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ గెలుపు కోసం, ఆయన మేలు తపించిన బిడ్డ కష్టాల్లో ఉండి, జైల్లో ఉన్నప్పుడు అధికారం కోసం పార్టీ ఫిరాయించి, జగిత్యాల ఎమ్మెల్యే రాజకీయాలకు మచ్చ తెచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు దావ సురేశ్, లోక బాపురెడ్డి, తురగ శ్రీధర్‌రెడ్డి, కొలుముల రమణ, శీలం ప్రవీణ్, స్థానిక నేతలు పాల్గొన్నారు.