Heavy Rains | గంగాధర, ఆగస్టు 28: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వంశీకృష్ణ గురువారం ప్రకటనలో సూచించారు. ప్రభుత్వం జారీ చేస్తున్న వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న వంతెనలపై, వరద ప్రవాహం ఉన్న రోడ్లపై ప్రయాణం చేయవద్దన్నారు.
తెగిపడిన విద్యుత్ తీగలు, కరెంటు స్తంభాలు , ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే విద్యుత్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తెలియజేయండి. ఎత్తయిన ప్రదేశాల్లో, ఎత్తైన చెట్ల కింద ఉండవద్దని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించ వద్దన్నారు. చేపలు పట్టేవాళ్ళు చెరువులు, బావులు,కుంటలు,కాలువలు వద్దకు వెళ్ళవద్దని, రైతులు వ్యవసాయ పనుల కోసం బావులు, పొలాల్లోకి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వినాయక మండపాల దగ్గర కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలానీ, ఏదైనా ప్రమాదం జరిగితే డయల్ 100 చేసి పోలీసుల కి సమాచారం ఇవ్వాలని ఎస్సై వంశీకృష్ణ సూచించారు.