
Karimnagar | తిమ్మాపూర్, అక్టోబర్ 26 : 10 ఏళ్ల పాటు అభివృద్ధి లో పరుగులు పెట్టించిన తన మానకొండూర్ నియోజకవర్గం అంటేనే ప్రస్తుతం ప్రజలు ఉలిక్కిపడుతున్నారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. నియోజకవర్గం అంటే బూతుల రాజ్యాంగ మారిందని చెప్పారు. ఇటీవల తనపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పెట్టిన కేసు విచారణలో భాగంగా నియోజకవర్గ నాయకులతో కలిసి ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అనంతరం తనను సైతం దూషించిన ఎమ్మెల్యే కవ్వంపల్లిపై చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ లకు ఫిర్యాదు చేశారు.
అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేను తాను దూషించినట్టు ఆడియో తయారుచేసి తనపై కేసు పెట్టించారని, కానీ ఎమ్మెల్యే కవ్వంపల్లి తనను తిట్టినట్టు ఒప్పుకున్నారని చెప్పారు. ఆయన తిట్లు వర్ణించలేని అని ఆయన చదివిన డాక్టర్ చదువులో అన్ని బూతులు ఉంటాయ అని ప్రశ్నించారు. ఏ ఆడియో అవసరం లేదని విలేకరులే సాక్ష్యం అని చెప్పారు. నన్ను తిడితే ఊరుకుంటాను కానీ తన కుటుంబాన్ని లాగడని నా తల్లి ఏం పాపం చేసిందని ప్రశ్నించారు. ఆయనే తిట్టి ఆడియో బయటికి రావడంతో సానుభూతి కోసం తన ఆడియో తయారుచేసి పోలీస్ కేసు పెట్టించాడానీ చెప్పారు. రసమయి అంటే ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ గడపదొక్కని వ్యక్తి అని, ఎవరి పైన కూడా ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవన్నారు. కానీ నేడు ఎవరేం మాట్లాడినా ఎవరేం పోస్ట్ చేసిన కేసులో కేసులని దుయ్యబట్టారు.
విలేకరులను బెదిరిస్తారా.!
నిజాలు రాస్తే విలేకరులను బెదిరిస్తారా అని మాజీ ఎమ్మెల్యే రసమయి ఫైర్ అయ్యారు. విలేకరులు ఉన్నది ఉన్నట్లు రాస్తే తిట్టాడని గుర్తు చేశారు. ఎవరే మాట్లాడిన బూతులే మాట్లాడడం అని, బూతుల నియోజకవర్గమని రాష్ట్రంలో అంటున్నారని వాపోయారు.
తాను లేని సమయంలో దాడి
తాను అమెరికాలో ఉన్న సమయంలో ఇదంతా నడిపించారని, ఇంట్లో లేని సమయంలో ఆడవాళ్లు, జంతువులు, పక్షులు ఉన్న కనికరం లేకుండా రాల్ల దాడి చేయించాడని మహిళలు ఆరిచిన వినలేదని అన్నారు. మానకొండూరులో చెడ్డి గ్యాంగ్ ను తయారు చేశారని, ఏ ఆరోపణ చేసిన ఆ గ్యాంగ్ తో దాడి చేస్తున్నారని విమర్శించారు.
అభివృద్ధిపై చర్చ పెట్టు
అభివృద్ధిపై చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ దాడులతో నియోజకవర్గాన్ని ఎటువైపు తీసుకోబోతున్నామని ప్రశ్నించారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు, మాట్లాడితే కేసులు పెట్టించడం ఏం సంస్కృతి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మారి అందరితో రివ్యూ చేసుకొని అభివృద్ధి పైపు దృష్టి సారించని హితువు పలికారు. రసమయితో పెట్టుకోవద్దని నా బలగం ఏంటో నీకు తెలియదని చెప్పారు. నువ్వు ఇదంతా చేసిన నేను పల్లెత్తో మాట కూడా అనలేదని, పద్ధతి భాష మార్చుకోవాలని, నువ్వు పద్ధతిగా ఉంటే ఎమ్మెల్యేగా మేము గౌరవిస్తామని.. ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దని హితువు పలికారు.
కవంపల్లి పై ఫిర్యాదు చేశాం
తనను తిట్టినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆధారాలతో తాను కూడా తిమ్మాపూర్ సిఐ కి ఫిర్యాదు చేశానని.. తొందరలోనే ఎఫ్ఐఆర్ కూడా అవుతుందని చెప్పారు. కేసు నమోదు అయిన తర్వాత చట్టపరంగా కోర్టులో తేలిపోతుందని అన్నారు. ఆయనతోపాటు జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఊల్లెంగుల ఏకనందం, సిద్ధం వేణు, శేఖర్ గౌడ్, రవీందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మహిపాల్, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.