గంగాధర, మార్చ్12: గంగాధర మండలం కురిక్యాల నుండి కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డును 5 ఫీట్ల ఎత్తులో వేస్తుండడంతో గతంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్(Transformer) రోడ్డుకు సమాంతరంగా వచ్చింది. నిత్యం వందలాది వాహనాలు ఈ రోడ్డుపై వెళ్తుండగా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ను తరలించాలని కోరుతున్నారు. దీనిపై ఆచంపల్లి విద్యుత్ శాఖ ఏఈ రామ్మోహన్ను వివరణ కోరగా..విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ తరలింపు గురించి నెల రోజుల క్రితమే ఆర్ అండ్ బీ శాఖ అధికారులకు లేఖ రాసినా స్పందన లేదని తెలిపారు. ఆర్అండ్బీ అధికారుల నుండి స్పందన వచ్చిన తర్వాత ఎస్టిమేషన్ వేసి డబ్బులు చెల్లించిన తర్వాత ట్రాన్స్ఫార్మర్లను తరలిస్తామని తెలిపారు.