Katakam Mrityunjayam | గంభీరావుపేట, సెప్టెంబర్ 24: ఆర్ అండ్ బి అధికారులు గుత్తేదారు నిర్లక్ష్యంతో ప్రాంత ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని టి పి సి సి సీనియర్ అధికార ప్రతినిధి కటకము మృత్యుంజయo అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట – లింగన్నపేట మానేరు వాగుపై నిర్మాణం చేస్తున్న వంతెనను మృత్యుంజయం పరిశీలించారు. సుమారు గత రెండు సంవత్సరాలుగా హై లెవెల్ వంతెన నిర్మాణం చేయడంలో గుత్తేదారు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయాలని, పనిచేయని గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టి వారిని ప్రోత్సహిస్తున్న ఆర్ అండ్ బి అధికారులపై చట్ట రిత్య చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే తూతూ మంత్రంగా వంతెన పనులు చేస్తున్న గుత్తేదారును తొలగించి రీ టెండర్ చేయాలి. గత 35 రోజుల నుండి వాగు పై తాత్కాలిక రోడ్డు తెగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.
నిజామాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు బస్సు లు నడిచే ప్రధాన రహదారి తెగిపోయి ఇన్ని రోజులు అయినా అధికారులు పరిశీలన చేసి తాత్కాలిక రోడ్డుకు ప్రతిపా దనలు సిద్ధం చేయక పోవడం సిగ్గు చేటు అని మృత్యుంజయం అన్నారు.