Odela Mallanna | ఓదెల జూన్ 29: పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం జాతర దినం కావడంతో భక్తులు తెలంగాణ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకొని పట్నం, బోనాలు సమర్పించుకున్నారు.
ఈ సందర్భంగా పెద్దపెల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తన ఇలవేల్పు అయినా ఓదెల మల్లికార్జున స్వామిని కుటుంబ సభ్యులతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి పట్నం, బోనంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న ఆలయానికి చేరుకున్న ఏసిపి కృష్ణ కు ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ యాదవ్ దంపతులను స్థానిక ఒగ్గు పూజారులు సన్మానించారు.