సుల్తానాబాద్ రూరల్ జూలై 29 : రైతులందరూ వరిలో కలుపు యజమాన్యం పద్ధతులు పాటించాలని ఏఈఓ రవితేజ అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడి మద్దికుంట గ్రామ పరిధిలోని పంట పొలాలను మంగళవారం ఏఈఓ రవితేజ సందర్శించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. పంట దిగుబడి పైన కలుపు యజమాన్యం చాలా కీలకమని, రైతులు సరైన యజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు.
కలుపును నిర్మూలించి, సరైన మోతాదు మేరకు మాత్రమే పంటకు నత్రజని సంబంధిత ఎరువులు వాడాలని పేర్కొన్నారు. సాగులో సలహాలకు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.