పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి జిల్లా కేంద్రంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సఖీ కేంద్రం (Sakhi Kendram)సేవలను ప్రజలకు, బాధితులకు మరింత చేరువ చేస్తూ మెరుగైన సేవలందించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో నూతనంగా రూ.48లక్షలతో నిర్మించిన సఖీ కేంద్రం వన్ స్టాప్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కఠారి రేవతిరావుతో కలిసి ప్రారంభించారు.
అంతకు ముందు మహిళా కమిషన్ సభ్యురాలు, ఎమ్మెల్యేలకు జిల్లా సంక్షేమశాఖ అధికారి పి. వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. భవనంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీడీపీవో కవిత, సఖీ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దారవేన స్వప్న యాదవ్, 1098 చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ కొల్లూరి ఉమాదేవి, మర్రి రమ, పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.