జ్యోతినగర్, ఫిబ్రవరి 7: సిద్దిపేట జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. గజ్వేల్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎన్టీపీసీ పట్టణం( NTPC residents) మూడో డివిజన్ న్యూ పోరట్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మెరుగు లింగమూర్తి, అతని అల్లుడు బిణేష్ ఇద్దరు మరణించారు. మెరుగు మహేష్‌కు త్రీవ గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి ఎన్టీపీసీ ఇంటి నుంచి షిఫ్ట్ డిజైర్ కారులో హైదరాబాద్‌కు పని నిమిత్తం బయలుదేరారు.
ఈ క్రమంలో ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలోని రాజీవ్ రాహదారిపై లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మెరుగు లింగమూర్తి, అతని అల్లుడు బినేష్ అక్కడికక్కడే మరణించారు. లింగమూర్తి సోదరదు మెరుగు మహేష్ రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడగా హైదరాబాద్ దవాఖానకు తరలించారు. కారు వేగంగా లారీని ఢీకొట్టడం వల్ల ముందు సీట్లో ఉన్న మామా అల్లుడు స్పాట్ లోనే మరణించారని పోలీసులు పేర్కొంటున్నారు.