పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉరేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి మున్సిపాలిటీలోని 24 వ వార్డు కౌన్సిలర్ న్యూగిల్ల మల్లయ్య అల్లుడు సిలువేరు తిరుపతి సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే కుటుంబ కలహాలతోనే తిరుపతి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.