ఓదెల, డిసెంబర్ 9 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పిట్టల ఎల్లయ్యపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక గ్రామస్తులు ఏకగ్రీవం చేసుకున్నారు. ఇక్కడ మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా గ్రామస్తులు సమావేశమై గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకున్నారు.
సర్పంచ్‌గా పిట్టల రవికుమార్, ఉప సర్పంచ్‌గా పెండం శ్రీకాంత్, వార్డు సభ్యులుగా తూడి అహల్య, బండి రాజ్ కుమార్, కనుకుట్ల శ్రీనివాస్, పిట్టల నవీన్, రాయల సుస్మిత, పిట్టల శారద, కందుల వనిత ఎన్నికైకయ్యారు. తమది చిన్న గ్రామం కావడంతో గ్రామంలో ఎలాంటి రాజకీయ కక్షలు ఉండకుండా గ్రామస్తులు అందరం ఐక్యంగా ఉండి గ్రామాభివృద్ధికి కంకణ బద్దలవుదామని ఏకగ్రీవం చేసుకున్నట్లు నూతన పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఏకగ్రీవానికి సహకరించిన గ్రామస్తులకు పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపారు.