పెద్దపల్లి రూరల్ జూన్ 17: గ్రామాలు, పట్టణాల్లో భూ భారతి పేరుతో నిర్వహిస్తున్న రెవెన్యు సదస్సులను సద్వినియోగం చేసుకుని రైతులు, ప్రజలు దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉండి సాగు చెసుకుంటున్న భూముల సమస్యలను పరిష్కరించుకుని వాటిపై పూర్తిస్థాయి హక్కులు పొందాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్యయాదవ్ అన్నారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వలలో భూ భారతి రెవెన్యూ సదస్సును నిర్వహించగా హాజరైన తహసీల్దార్ రైతులకు పలు సూచనలు చేస్తూ దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా పలు రకాల సమస్యలపై వివరిస్తూ రైతులు, ప్రజలు వారి ఆధీనంలో ఉన్న భూములకు రెవెన్యు పరమైన సమస్యలు లేకుండా చూసుకుని సర్వహక్కులు ఉండేలా రికార్డులను సరిచేసుకునేందుకు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటరాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి దేవరనేని నిశాంత్ రావు, సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.