అంతర్గాం, జులై 17 : భూముల కొలతల్లో రైతుల సందేహాలను శిక్షణ పోందిన సర్వేయర్లు నివృత్తి చేయాలని అంతర్గాం మండల తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ సూచించారు. అంతర్గాం మండలానికి భూముల సర్వే శిక్షణ కోసం వచ్చిన 12 మంది ట్రెయినీ సర్వేయర్లు తహసీల్దార్ రవీందర్‌ను కలవగా వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..అంతర్గాం మండలంలో శిక్షణ పొందిన సర్వేయర్లు రైతులతో మంచి సంబంధాన్ని కొనసాగించాలని వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ లలిత కుమారి సిబ్బంది పాల్గొన్నారు.