ముత్తారం, మే 25 : మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన జావిద్ పాషా స్ఫూర్తి పురస్కారానికి ఎంపికైయ్యాడు. జావిద్ పాషా గత కొన్ని సంవత్సరాలుగా మోటివేషనల్ స్పీకర్గా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు శిక్షకునిగా వారిలో మోటివేషన్ కల్పిస్తున్నాడు.
అలాగే బహుమతులను ఇచ్చి ప్రోత్సహించడమే కాకుండా పేద విద్యార్థుల చదువుకు సహాయం చేస్తున్న జావిద్ పాషాను వసుందర విజ్ఞాన వికాసం మండలి జ్యూరీ కమిటీ గుర్తించి స్ఫూర్తి పురస్కారానికి ఎంపిక చేసింది. జూన్ నెల 10వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో వసుంధర విజ్ఞాన వికాసం మండలి స్ఫూర్తి పురస్కారాన్ని అందజేయనున్నారు.