SRSP Canal : పెద్దపల్లి మండలం పెద్దకళల గ్రామంలోని సాగునీరు పోరాల్సిన ఎస్సార్ ఎస్పీ కాలు ఎస్సారెస్పీ కాలువ మురుగునీటి కూపాన్ని తలపిస్తోంది. నిరంతరం పంట పొలాలకు వెళ్లే ఎస్సారెస్పీ కాలువలో ఇండ్ల పరిసరాల నుంచి వచ్చిన మురికి నిల్వ ఉండడంతో ఆ కాలువ పొడవున నివసిస్తున్న ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. చాలా కాలంగా ఎస్సారెస్పీ కాలువలు మొరుగునీరు చెరువును తలపించేలా నిలువ ఉండడం మూలంగా ఆ నీటిలో నాచు పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది.
అంతేకాదు వ్యాధులకు సంబంధించిన క్రిమి కీటకాదులకు కాలువ నిలయంగా మారింది. ఎస్ఆర్ఎస్పీ కాలువ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలోనే ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. మురుగునీటిని శుభ్రం చేయడంలో అధికారుల పట్టింపు లేదని కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆదేశిస్తున్నా.. తరచూ గ్రామాలను సందర్శిస్తున్నా పరిస్థితి మారడం లేదనడానికి ఈ ఎస్సారెస్పీ కాలువే నిదర్శనం.