సుల్తానాబాద్ రూరల్ మార్చి 30 : జీవితంలో విద్యార్థి దశ అనేది ఒక మైలురాయని, ఆలోచించి వేసే ప్రతి అడుగు భవిష్యత్తును నిర్ధారిస్తుందని శ్రీవాణి కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నరసయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని విజయ గార్డెన్లో సోమవారం సుల్తానాబాద్ శ్రీవాణి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్క విద్యార్థి అంకితభావంతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని అల్లరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలసాని శ్రీనివాస్, డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.