Skill Training | సుల్తానాబాద్ రూరల్, మే 27: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి రంగాలకు సంబంధించిన నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ప్రిన్సిపాల్ సిహెచ్ గిరిజ అన్నారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ గిరిజ మాట్లాడుతూ.. పదవ తరగతి, ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న గురుకుల విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు.
ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో యుఎన్ ఎక్స్ట్ సంస్థ ఆధ్వర్యంలో 90 గంటలు తరగతి గదిలో ప్రత్యక్షంగా, 75 గంటలు సెల్ఫ్ లర్నింగ్ విధానంలో శిక్షణ ఉంటుందన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, లైవ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు, హెచ్ఆర్ సంబంధిత విషయాల్లో స్కిల్స్, ఇంటర్వ్యూ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు.
జూన్ మూడో వారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆసక్తిగల పూర్వ విద్యార్థులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను కలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Rains | హైదరాబాద్‌కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్‌లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు