రామగిరి, ఫిబ్రవరి 20: పెద్దపల్లి జిల్లా (Peddapalli) రామగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతిచెందారు. గురువారం ఉదయం మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిలో కల్వచర్ల బొక్కల వాగు వద్ద అదుపుతప్పతిన బైక్ తప్పి వంతెన పైనుంచి వాగులో పడిపోయింది. దీంతో అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న ఊరకొండ రాజ్ కుమార్(40) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వాగులోనుంచి వెలికితీశారు.
రాజ్ కుమార్ స్వగ్రామం రామగిరి మండలం రాజాపూర్. అయితే ఉద్యోగ రీత్యా సెంటినరికాలనీలోని సింగరేణి క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.