కాల్వ శ్రీరాంపూర్ జూన్ 11 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల గ్రామంలో మంగళవారం రాత్రి గొర్రెల మందపై పిచ్చికుక్కల దాడి చేయగా 20 గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. మంగళవారం రాత్రి గొర్రెల మంద పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత పిచ్చి కుక్కలు ఒకేసారి మందపై దాడి చేసి మూడెత్తుల సంపత్కు చెందిన 03, బోటుకు మహేష్ కు చెందిన 17 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.
మృతి చెందిన గొర్రెల విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని బాధితులు తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామ యాదవ సంఘం నాయకులు, జిల్లా గొర్రెల కాపరుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తాత రాజు కోరారు.