కోల్ సిటీ, జనవరి 4: లఘు చిత్ర నిర్మాతలు, దర్శకులు వ్యక్తిగత నియంత్రణతో పాటు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని పలువురు పేర్కొన్నారు. నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మించిన ‘అబ్బా.. మీరేది క్లారిటీగా చెప్పరా..’ అనే హాస్య లఘు చిత్రంను ఆదివారం గోదావరిఖని నిరీక్షణ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరి కళా సంఘాల సమాఖ్య గౌరవ సలహాదారు రాజమౌళి, సీనియర్ కళాకారులు సిరిపురం శ్రీనివాస్, దయానంద్ గాంధీలు ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ హాస్య లఘుచిత్రం ఎలాంటి అశ్లీలత లేకుండా ఎంతో నవ్వించిందన్నారు. ఈ లఘుచిత్రంలో నటించిన శ్రీచంద్ పేరబత్తిన, శాంతి నిరీక్షణ, జాన్ ఈవెన్ మంచి హాస్యంను పండించారన్నారు. దర్శకుడు చంద్రపాల్ ఎప్పటిలాగే మంచి హాస్య చిత్రాన్ని అందించారని అభినందించారు. కార్యక్రమంలో నటి శాంతి నిరీక్షణ, మేజిక్ రాజా, చంద్రపాల్, బెన్ని, లెన్ని తదితరులు పాల్గొన్నారు.