Seetha Ramachandra Swamy | సుల్తానాబాద్ రూరల్, మే 20 : సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగలా జరిగింది. సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలోని సీతారామచంద్రస్వామి, సంకట విభజన రామభక్త వీర హనుమాన్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ వేద పండితుల మంత్రోత్సవంతో భక్తజన సమూహం మధ్య స్వామివారి కల్యాణాన్ని జరిపించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం అఖండ దీపారాధన, పుణ్యా వచనం, అంకురారోపణ, ధ్వజారోహణం కార్యక్రమాలతోపాటు తదితర కార్యక్రమాలను నిర్వహించినట్లు భక్తమండలి సభ్యులు వంగపల్లి అనసూయ దేవి, సుగుణాకర్ తెలిపారు.
ఇవాళ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మే 21న సీతారామచంద్రస్వామికి సామ్రాజ్య పట్టాభిషేకం, హవనము, బలిహరణం కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Read Also :
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ