Sammakka Saralamma Jathara | సుల్తానాబాద్ రూరల్, జనవరి 30: పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్లా మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర భక్తులతో కిక్కిరిసిపోయింది. శుక్రవారం వనదేవతల దర్శనం కోసం భక్తులు క్యూలైన్ కట్టారు.
ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేయడంతో ప్రశాంత వాతావరణంలో మొక్కలు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఏర్పాట్లను తహశీల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

Neerukulla Jathara3
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్, సర్పంచ్ కాంపల్లి సతీష్, ఈవో శంకరయ్య, ఉప సర్పంచ్ సతీష్, కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.

Neerukulla Jathara2
అలాగే నారాయణపూర్, గర్రెపల్లి, తొగర్రాయి గ్రామంలో జరిగే జాతర కు భక్తులు పెద్ద సంఖ్యల హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. నారాయణపూర్ చైర్మన్ తిరుపతిరావు, సర్పంచ్ గురుకుల సతీశ్, ఉపసర్పంచ్ రామారావుతోపాటు తదితరున్నారు.