Shraddha Kapoor | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. AA23 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కబోతుంది. అయితే ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇటీవల ‘స్త్రీ 2’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న శ్రద్ధా, గతంలో ప్రభాస్ సరసన ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అల్లు అర్జున్‌తో జతకట్టడం ద్వారా మరోసారి టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందని సినీ వర్గాలు అంటున్నాయి.
లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు తక్కువ ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఈ సినిమాలో శ్రద్ధా పాత్ర ఎంతో కీలకంగా మరియు పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా పూర్తయిన అనంతరం లోకేష్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ ఇద్దరు దిగ్గజాల కాంబోలో రాబోతున్న సినిమా ‘లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU) లో భాగంగా ఉంటుందా లేక సోలో ప్రాజెక్టా అన్నది తెలియాల్సి ఉంది. ఈ క్రేజీ అప్డేట్తో అల్లు అభిమానులు, సినీ ప్రేమికులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Blessed with the best @alluarjun #AALoki
Looking forward to kicking off this journey with you sir 🤗
Let’s make it a massive blast 💥💥💥
Once again with my brother @anirudhofficial 💥💥#AA23 #LK7 @MythriOfficial pic.twitter.com/AZpufiNI2t— Lokesh Kanagaraj (@Dir_Lokesh) January 14, 2026