The Rajasaab OTT | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన క్రేజీ హారర్-కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’ ఓటీటీలోకి రాబోతుంది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం విడుదలైన నెల రోజుల్లోపై ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ అత్యంత భారీ ధరకు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోగా.. ఫిబ్రవరి 06 నుంచి ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూపిస్తూ మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాజు అలియాస్ రాజాసాబ్ (ప్రభాస్)కు అమ్మానాన్న అన్నీ నాయనమ్మ గంగాదేవి(జరీనా వహాబ్)నే. గంగాదేవికి ఆల్జీమర్స్. ప్రతి విషయాన్ని మర్చిపోతుంటుంది. కాకపోతే ఎప్పుడో తనని విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్త కనకరాజు (సంజయ్‌దత్)ని మాత్రం గుర్తుపెట్టుకుంటుంది. తాత కనకారాజు కోసం వెదుకుతున్న రాజుకు కొన్ని సంచలన నిజాలు తెలుస్తాయి. నర్సాపూర్ అడవిలోని ఓ రాజమహల్ వున్నాడనే సంగతి తెలుసుకుంటాడు. ఆ రాజమహల్ అడుగుపెట్టిన రాజుకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? కనకరాజు గురించి ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? అసలు గంగాదేవి గతం ఏమిటి? కనకరాజు గంగాదేవిని ఎందుకు వదిలివెళ్ళిపోయాడు? తన లక్ష్యం ఏమిటి? నాయనమ్మ కోసం రాజు ఎలాంటి పోరాటం చేశాడనేది మిగతా కథ.
Rebel Star Prabhas #TheRajaSaab 👻 (Telugu) streaming from February 6 on JioHotstar in Telugu, Tamil, Kannada & Malayalam 🍿!!#OTT_Trackers pic.twitter.com/8VC6wmUtf7
— OTT Trackers (@OTT_Trackers) January 30, 2026