పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో దొంగలు (Robbery) హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన వేల్పుల కనకయ్య అనే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాళాలు పగులగొట్టిన దుండగులు.. పెద్దమొత్తంలో బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పెద్దపల్లి రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. 11 తులాల బంగారం, 55 తులాల వెండి, రూ.2 లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలువెళ్లడిస్తామని ఎస్ఐ మల్లేష్ తెలిపారు.