Scanning centres | పెద్దపల్లి, మే27: స్కానింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పని సరి డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి స్పష్టం చేశారు. స్కానింగ్ మిషన్ ఉన్న ప్రైవేట్ దవాఖానలు తప్పనిసరిగా పీసీపీ ఎన్డీటీ చట్టం 1994 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో పీసీపీ ఎన్డీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు డీంఎంహెచ్ మాట్లాడుతూ.. జిల్లాలో 31 స్కానింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ ఉందని చెప్పారు.
రిజిస్ట్రేషన్ లేని స్కానింగ్ సెంటర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోదావరిఖనిలోని లోటస్ స్కాన్ కేంద్రం రెన్యూవల్ కోసం, పెద్దపల్లిలోని తిరుమల ఆసుపత్రి న్యూ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు సమర్పించగా, సలహా కమిటీ పరిశీలించి జిల్లా అప్రోప్రేయేట్ అథారిటీకి పంపినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వీ వాణిశ్రీ, గైనకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి, పిడియాట్రిషియన్ డాక్టర్ రవీందర్, రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి చైర్మన్ కావేటి రాజగోపాల్, ఇన్చార్జి డీపీఆర్వో జగన్ పాల్గొన్నారు.
Rains | హైదరాబాద్కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు