రామగిరి ఫిబ్రవరి 14: తమ విలువైన పంట భూములను ఇండ్రస్ట్రియల్ కారిడారు కోసం ఇవ్వమని రత్నాపూర్ గ్రామ రైతులు తేల్చి చెప్పారు. తమకు తెలియకుండానే అక్రమంగా ప్రభుత్వం భూములను గుంజుకునే పన్నాగాహం చేసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జీపీ ఆఫీస్ నోటీస్ పెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంటల పండే విలువైన భూములు కోల్పోతే మా జీవితాలు ఏం కావాలని రైతులు ప్రశ్నించారు. వ్యవసా యాన్నే నమ్ముకొని జీవిస్తున్న తాము భూములు కోల్పోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రైతులు గ్రామంలోని బొడ్రాయికి ఊరు పంట భూములు కాపడాలని వినూత్నన రీతిలో వినతి పత్రం ఇచ్చారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.