Brahmotsavam | సుల్తానాబాద్ రూరల్ మే 18 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలోని సీతారామచంద్రస్వామి, సంకట విభజన రామభక్త వీర హనుమాన్ బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబైంది. ఆలయాన్ని అందంగా అలంకరించి ఆలయం ఆవరణలో చలువ పందుళ్లు ఏర్పాటు చేశారు. గ్రామంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు భక్త మండలి సభ్యులు వంగపల్లి అనసూయ దేవి, సుగుణాకర్ రావు తెలిపారు.
ఆదివారం నుంచి 22 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. హనుమాన్ జయంతి లో భాగంగా అధ్యయన ఉత్సవం ఆరంభం, వ్య ప్రబంధ పారాయణం, తీర్థ ప్రసాద వితరణ, 20న పరమ రథోత్సవం, 21న సీతారామచంద్రస్వామి కి సామ్రాజ్య పట్టాభిషేకం, హవనము, బలిహరణం. 22న హనుమాన్ జయంతి సందర్భంగా అభిషేకం ఆకు పూజ, పూర్ణాహుతి, చక్రస్థానం, తీర్థ ప్రసాద గోష్టి, పుష్పయాగం, సప్తవర్ణ సేవ, వసంతోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేపట్టున్నట్లు పేర్కొన్నారు.