పెద్దపల్లి రూరల్, జూన్ 20: పెద్దపల్లి మండలంలోని పెద్దపల్లి-చీకురాయి మార్గంలో కరీంనగర్-పెద్దపల్లి రైల్వే లైన్ గేటు (Railway Gate), పట్టాలకు మరమ్మత్తులు చేపట్టారు. ఈ నేపథ్యంలో రైల్వేగేటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఈ పనులు రెండు రోజుల పాటు కొనసాగుతాయన్నారు. అందువల్ల పనులు ముగిసే వరకు పెద్దపల్లి- చీకురాయి-భోజన్నపేట- మూలసాల మార్గంలో ప్రయాణం చేసేవారంతా పెద్దపల్లి-హన్మంతునిపేట-భోజన్నపేట- మూలసాల మార్గంలో గానీ, పెద్దపల్లి- పెద్దబొంకూర్ -కొత్తపల్లి- మూలసాల మార్గంలో గానీ ప్రయాణం చేయాలని తెలిపారు.