రామగిరి, ఏప్రిల్ 19: సింగరేణి (Singareni) అకామిడేషన్ కల్పించిన వాణి స్కూల్ యాజమాన్యం అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నదని, దానిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సెంటినరి కాలనీలో ఫ్లెక్సీలు వెలిశాయి. పిల్లలకు కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. జేఏసీ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్లెక్సీల్లో వాణి పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించకుండ అధిక ఫీజులు వసూల్ చేయడం అరికట్టాలని సింగరేణి ఎండీకి విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో సీబీఎస్ఈ కరికులమ్ ప్రవేశ పెట్టాలని కోరారు.