సుల్తానాబాద్ రూరల్ అక్టోబర్ 07 : దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్కీ డ్రా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామం శివాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించారు. కనకదుర్గ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం విజయతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కనకదుర్గ యూత్ నిర్వాహకుడు, అర్చకులు ఉప్పల మల్యాల చంద్రశేఖర్ శర్మ సమక్షంలో వంగ శ్రీవాణి అనిల్ దంపతులు కమిటీకి వ్యవసాయానికి సంబంధించిన మందు స్ప్రే పంపును (చార్జింగ్ పంపు) అందజేశారు.
ఈ సందర్భంగా మొదటి బహుమతి అరుణిక, మౌనిక లకు మందు స్పే పంపును అందజేశారు. రెండో బహుమతి 10 గ్రాముల వెండి గెల్లు మన్నెమ్మ ముత్యాలకు, మూడో బహుమతి సంకనపల్లి పవన్ కుమార్ కు అమ్మవారి చీర అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాసర్ల అంజలి అనంతరెడ్డి, జాగృతి నియోజకవర్గ కన్వీనర్ బొంకూర్ ఐలయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి సంపత్ యాదవ్, యూత్ అధ్యక్షులు బొంకూర్ సదయ్య, గ్రామ పెద్దలు. సురేందర్ రెడ్డి, కిషన్ రెడ్డి, సతీష్, శ్రీనివాస్, లక్ష్మణ్, రాజయ్య తో పాటు తదితరులున్నారు.